గురజాల నియోజకవర్గంలో దుమ్మురేపిన యువగళం గ్రామాగ్రామాన యువనేతకు ఆత్మీయ స్వాగతం
పిడుగురాళ్ల బహిరంగసభకు పోతెత్తిన జనం
గురజాల: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలో దుమ్మురేపింది. జూలకల్లు నుంచి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన పాదయాత్రకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలనుంచి స్పందన లభించింది. మాజీ ఎమ్మెల్యే యరపతినేని నేతృత్వంలో 101 మంది మహిళలు కలశాలతో లోకేష్ కు స్వాగతం పలుకగా, వేదపండితుల ఆశీర్వచనాలు అందజేశారు. సాంప్రదాయ డప్పులు, థిండ్సా నృత్యాలు, కేరళ వాయిద్యాలు, ఒంటెలు, అశ్వాలతో యువనేతకు అపూర్వస్వాగతం లభించింది. బాణాసంచా మోతలు, పార్టీ కార్యకర్తల కేరింతల నడుమ ఉత్సాహంగా పాదయాత్ర సాగింది. దారిపొడవునా హారతులిస్తూ మహిళలు నీరాజనాలు పలికారు. ధరల పెరుగుదల, అరాచకపాలనతో అవస్థలు పడుతున్నామని గురజాల ప్రజల ఆవేదన వ్యక్తంచేశారు. మరికొద్దినెలల్లో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి కష్టాలు తీరుస్తుందని భరోసా ఇస్తూ యువనేత ముందుకుసాగారు. భోజన విరామానంతరం జానపాడు శివారు నుంచి ప్రారంభమైన పాదయాత్ర పిడుగురాళ్ల చేరుకుంది. పిడుగురాళ్ల కన్యకాపరమేశ్వరి గుడివద్ద జరిగిన బహిరంగసభకు జనం పోటెత్తారు. పట్టణంలో వీధులన్నీ కిటలాడాయి. జనం భవనాలపైకి ఎక్కి యువనేత ప్రసంగాన్ని ఆసక్తిగా ఆలకించారు. 178వరోజు యువనేత లోకేష్ 19.6 కి.మీ.ల దూరం పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువనేత లోకేష్ 2373.7 కి.మీ.ల మేర పూర్తయింది. బుధవారం సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం చౌటపాపాయపాలెంలో జరిగే బహిరంగసభలో లోకేష్ ప్రసంగిస్తారు. అనంతరం పాదయాత్ర పెదకూరపాడు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది.
పులకేసి పాలనలో అన్నదాతల అష్టకష్టాలు
జూలకల్లు ఎన్ ఎస్పి కాలనీ వద్ద సెల్ఫీ దిగిన యువనేత లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇది గురజాల అసెంబ్లీ నియోజకవర్గం జూలకల్లు శివార్లలోని నాగార్జునసాగర్ కుడికాలువ. నిర్వహణ లేకపోవడంతో గేట్లు శిథిలావస్థకు చేరి సరిగా నీరందక రైతులు నానాతంటాలు పడుతున్నారు. దిక్కుమాలిన ప్రభుత్వంలో గేట్లకు గ్రీజుపెట్టే పరిస్థితి కూడా లేదు. అధికారంలోకి వచ్చాక అన్నమయ్య ప్రాజెక్టు, గుండ్లకమ్మ, పులిచింతల గేట్లు కొట్టుకుపోయాయి. పులకేసి పాలనలో రాష్ట్రప్రజలు ఇంకా ఎన్ని సిత్రాలు చూడాలోనని లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
బాంబులకే భయపడం…రాళ్లకు బెదురుతామా?
ప్రజలు కష్టాల్లో ఉంటే నువ్వు ప్యాలస్ లో పడుకుంటావ్. మమ్మల్ని మాత్రం ప్రజల్లో తిరగనీయనని అంటావు. మా కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇస్తారు, వైసిపి వాళ్లు వచ్చి రాళ్లేస్తారు. రాళ్లేస్తే పారిపోవడానికి మాది బులుగు జెండా కాదు బ్రదర్ దమ్మున్న పసుపు జెండా. బాంబులకే భయపడని కుటుంబం మాది మీ రాళ్లకి భయపడతామా? ముందే చెప్పా సాగనిస్తే పాదయాత్ర…అడ్డుకుంటే వైసిపి కి అంతిమయాత్ర. రాళ్లేస్తాం, ఫ్లెక్సీలు చించుతాం అంటూ ఎవడైనా వస్తే నెక్స్ట్ బర్త్ డే ఉండదు.
గురజాలగడ్డపై పాదయాత్ర అదృష్టం
పౌరుషానికి పుట్టినిల్లు పల్నాడు. వినుకొండ అదిరిపోయింది. మాచర్ల మాస్ దెబ్బ సూపర్. గురజాల గర్జించింది. గురజాల ప్రజల గుండెల నిండా ధైర్యం ఉంటుంది. దళితుడైన మాల కన్నమదాసుని సర్వ సైన్యాధ్యక్షుడుని చేసి గౌరవించిన నేల గురజాల. యుద్దానికి వెళ్తున్న భర్తకు వీర తిలకం దిద్ది సాగనంపిన మగువ మాంచాల పుట్టిన ప్రాంతం గురజాల. దైద అమరలింగేశ్వర స్వామి దేవాలయం, శ్రీ పాతపాటేశ్వరీ అమ్మవారు, శ్రీ ఇష్ట కామేశ్వరస్వామివారి ఆలయాలు ఉన్న పుణ్యభూమి గురజాల. ఘన చరిత్ర ఉన్న గురజాల గడ్డపై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.
కార్యకర్తలను వేధించిన వారిని వదలను
శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు. నా తల్లిని అవమానించిన ఏ ఒక్కడిని వదిలిపెట్టను. కష్టకాలంలో క్యాడర్ కి అండగా నిలబడింది మన పులి యరపతనేని శ్రీనివాస్. ఆయన్ని భారీ మెజారిటీ తో గెలిపించే బాధ్యత మీది. కార్యకర్తలను వేధించిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం.టిడిపి నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వారు గురజాలలో ఉన్నా, గుజరాత్ పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తా. పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకుంటా.
రాజధానిపై మాటతప్పుడు – మడమతిప్పుడు
గుంటూరు జిల్లా వైసిపి నేతలు అమ్మ లాంటి అమరావతిని చంపేసారు. రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలి అన్నాడు. అసెంబ్లీ లో అమరావతి కి జై కొట్టాడు. కనీసం 30 వేల ఎకరాలు ఉండాలి అన్నాడు. ఎన్నికల ముందు అమరావతి లోనే రాజధాని అన్నాడు. ఆ రోజు ఉమ్మడి గుంటూరు జిల్లా వైసిపి నేతలు అంతా అమరావతే రాజధాని, అందుకే జగన్ ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాడు అని అన్నారు. కానీ గెలిచిన తరువాత ఏం అయ్యింది? రాష్ట్రానికి లైఫ్ లైన్ అయిన అమరావతిని జగన్ విధ్వంసం చేసాడు. అమరావతి ని స్మశానం అన్నాడు, అమరావతిలో భూకంపాలు వస్తాయి అన్నాడు, వర్షం వస్తే మునిగిపోతుంది అన్నాడు. కులం,మతం, ప్రాంతం పేరుతో అమరావతిపై విషం కక్కాడు. జగన్ కుట్రలను తట్టుకొని నిలబడింది అమరావతి
ఒక్కొక్కరిపై రూ.45వేల జె-ట్యాక్స్
ఆప్షన్1. బూమ్ బూమ్. ఆప్షన్2. ప్రెసిడెంట్ మెడల్. ఆప్షన్3. ఆంధ్రా గోల్డ్. ఆప్షన్4. ప్రజల రక్తం. రోజుకి క్వార్ట్రర్ తాగే వాళ్ల దగ్గర నుండి జగన్ ఎంత కొట్టేస్తున్నాడో తెలుసా? క్వార్ట్రర్ పై రూ.25 రూపాయలు. నెలకి రూ. 750, ఏడాదికి రూ. 9 వేలు, 5 ఏళ్లకు ఎంత? రూ.45 వేలు. రోజుకి క్వార్ట్రర్ తాగే వ్యక్తి జగన్ కి కడుతున్న జే ట్యాక్స్ రూ.45 వేలు. ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ గురించి నేను చెప్పడం లేదు. మీ రక్తం తాగుతూ దొబ్బుతున్న సొమ్ము గురించి చెబుతున్నా.
ఆ మందు విషం కంటే ప్రమాదం!
ఎన్నికల ముందు మద్యపాన నిషేధం తరువాతే ఓట్లు అడుగుతా అన్నాడు. కానీ గెలిచిన తరువాత సొంత లిక్కర్ కంపెనీలు, ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచాడు. అంత కంటే డేంజర్ ఏంటో తెలుసా జగన్ మందు విషం కంటే ప్రమాదం. రాష్ట్రంలో ఏ ఆసుపత్రి కైనా వెళ్లి డేటా తీసుకోండి. గత నాలుగేళ్లలో జే బ్రాండ్ లిక్కర్ తాగి చనిపోతున్న వాళ్లు వేల సంఖ్యలో ఉన్నారు. జే బ్రాండ్ లిక్కర్ లో ఉండే ప్రమాదకరమైన కెమికల్స్ దెబ్బకి బాడీ పార్ట్స్ అన్ని డ్యామేజ్ అవుతున్నాయి. మహిళల తాళిబొట్లు తెంచుతున్నావ్, పసుపు కుంకుమ చెరిపేస్తున్నావ్. ఈ పాపం నిన్ను ఊరికే వదలదు జగన్.
మహిళల కష్టాలు తీర్చేందుకే మహాశక్తి!
2300 కి.మీ.ల పాదయాత్రలో మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను . భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు ఉంటే రూ.30 వేలు. 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం.
యువత భవితను దెబ్బకొట్టారు!
యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలి అని కోరుకుంటున్నాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు. యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం.అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.
మోటార్లకు మీటర్లు – రైతులకు ఉరితాళ్లు
వైసీపీ పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లు. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. టిడిపి మీకు అండగా ఉంటుంది. రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. ఇప్పుడు జిపిఎస్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు.
పోలీసుల డబ్బునూ కొట్టేశాడు!
పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది. ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని దివాలాకోరు ప్రభుత్వం ఇది. ఇప్పుడు ఏకంగా పోలీసులకు ఇచ్చే అలవెన్స్ కూడా కోతపెట్టాడు జగన్. 15 శాతం అలవెన్స్ కట్ చేసాడు. ఎస్ఐ కి 10 వేలు, హెడ్ కానిస్టేబుల్ కి 8 వేలు, కానిస్టేబుల్ కి 6 వేలు కట్ చేసాడు. జగన్ తెచ్చిన జిఓ 79 రద్దు చేస్తాం. అలవెన్స్ యధాతధంగా ఇస్తాం.
బిసిలకోసం ప్రత్యేక రక్షణ చట్టం తెస్తాం
బీసీలు పడుతున్న కష్టాలు నేను నేరుగా చూసాను. పాలనలో 26 వేల బిసిలపై అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ వైసీపీ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు. దళితుల్ని చంపడానికి జగన్ వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. వైసీపీ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హజీరా. ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు.
గురజాలను అభివృద్ధి చేసింది టిడిపి!
గురజాలను అభివృద్ధి చేసింది టిడిపి. 2014 నుండి 2019 వరకూ రూ.2265 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది గురజాల సింహం యరపతినేని శ్రీనివాస్. రూ.336 కోట్లతో 6 వేల టిడ్కో ఇళ్లు, రూ.216 కోట్లతో ఎన్టీఆర్ గృహాలు, రూ.220 కోట్లతో సిసి రోడ్లు, కమ్యూనిటీ హాల్స్, అంగన్వాడీ భవనాలు, రూ.170 కోట్లతో ఆర్ అండ్ బి రోడ్లు, సాగు, తాగు నీటి ప్రాజెక్టులు, గురజాల, పిడుగురాళ్ల పట్టణాల అభివృద్ధి, రూ.160 కోట్లతో పుష్కర ఘాట్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క రోజు పడుతుంది. కానీ మీరు ఏం చేసారు? పాలిచ్చే ఆవుని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు.
మాఫియాలకు అడ్డగా మార్చిన మహేష్
గురజాలను అభివృద్ధి చేస్తారని మీరు భారీ మెజారిటీతో కాసు మహేష్ రెడ్డిని గెలిపించారు. ఆయన చేసింది ఏంటి? ల్యాండ్, శ్యాండ్, వైన్, మైన్ మాఫియాకి గురజాలని అడ్డాగా మార్చేసాడు. అతని అవినీతి, అరాచకాల గురించి తెలుసుకున్న తరువాత పేరు మార్చాను. కాసు. మహేష్ కాదు క్యాష్ మహేష్. అక్రమ మైనింగ్ లో వెయ్యి కోట్లు కొట్టేసాడు క్యాష్ మహేష్. అక్రమ మైనింగ్ లో రోజుకి రూ.20 లక్షలు కొట్టేస్తున్నాడు. ట్రాక్టర్ సున్నపురాయి కి రూ.1200 కే ట్యాక్స్. తెలంగాణ మద్యం తెచ్చి గురజాలలో అమ్మేస్తున్నారు క్యాష్ మహేష్ అండ్ గ్యాంగ్. నాలుగేళ్లలో రూ.1440 కోట్లు దోచుకున్నాడు.
గ్రావెల్, ఇసుక దోపిడీ!
అక్రమ గ్రావెల్ తవ్వకాల ద్వారా రూ.200 కోట్లు. అక్రమ ఇసుక రవాణా ద్వారా రూ.200 కోట్లు. పేకాట క్లబ్బులు, గంజాయి దందా నడుపుతున్నాడు క్యాష్ మహేష్. రూ.400 కోట్లు విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేసాడు క్యాష్ మహేష్. పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ పేరుతో రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి రూ.200 కోట్లు సంపాదించాడు. నరసరావుపేటలో రూ.400 కోట్లతో భారీ షాపింగ్ కాంప్లెక్స్, కళ్యాణ మండపం, హైదరాబాద్ గచ్చిబౌలిలో రూ.500 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నాడు. నరసరావుపేట ములకలూరులో 100 ఎకరాలు కొట్టేసాడు. కోడి మేత, సున్నం తయారీ కంపెనీలను బెదిరించి కప్పం కట్టించుకుంటున్నాడు.
క్యాష్ మహేష్ దోపిడీకి బలైన వాళ్లెందరో!
దోపిడీలో జూనియర్ జగన్ ఈ క్యాష్ మహేష్. గురజాలలో క్యాష్ మహేష్ అరాచకాలకు సామాన్యులు బలైపోయారు. క్యాష్ మహేష్ మైనింగ్ దందాకి 8 మంది పిల్లలు బలైపోయారు. మైనింగ్ గుంతల్లో పడి 8 మంది పిల్లలు చనిపోయారు. 8 మందిలో ముగ్గురు బీసీలు, 3 మైనార్టీలు. 11 మంది టిడిపి కార్యకర్తల్ని, నాయకుల్ని దారుణంగా చంపించాడు క్యాష్ మహేష్. అందులో ఇద్దరు దళితులు, 1 గిరిజనుడు, ముగ్గురు బీసీలు, ముగ్గురు మైనార్టీలు ఉన్నారు. క్యాష్ మహేష్ అండ్ గ్యాంగ్ అరాచకాలకు ఫుల్ స్టాప్ పెడతాం. కేవలం 9 నెలలు ఓపిక పట్టండి, క్యాష్ మహేష్ ని క్యాట్ మహేష్ .. పిల్లి మహేష్ గా మార్చే బాధ్యత నాది.
వైసిపి నాయకులు కబ్జాచేసిన ఆస్తులు వెనక్కి!
పిడుగురాళ్లలో వైశ్య సోదరులకు చెందిన ఆస్తులను వైసిపి నాయకులు కబ్జా చేసారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మీ ఆస్తులు మీకు తిరిగి ఇప్పిస్తాం. కబ్జాలకు పాల్పడిన వైసిపి నేతలపై చర్యలు తీసుకుంటాం. పిడుగురాళ్ల చిప్స్ మిల్లులు, పల్వరైజింగ్ మిల్లుల యజమానులను వైసిపి ప్రభుత్వం వేధిస్తుంది. నోటీసులు, కేసులు అంటూ వేధిస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కేసులన్నీ ఎత్తేస్తాం. పల్నాడు లో వడ్డెర కార్మికులను క్వారీ యజమానులుగా చేస్తాం.
అధికారంలోకి వచ్చాక ప్రతిఇంటికీ కుళాయి!
2024 లో టిడిపి అధికారంలోకి రావడం ఖాయం. గురజాలలో భారీ మెజారిటీతో టిడిపిని గెలిపించండి. టిడిపి గెలిచిన వెంటనే వాటర్ గ్రిడ్ పధకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం. తంగెడ, కొత్తపాలెం,పిల్లుట్ల గ్రామాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి సాగునీరు అందిస్తాం. కృష్ణానది నుండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గురజాల, దాచేపల్లి, మాచవరం మండలాల్లోని గ్రామాలకు సాగునీరు అందిస్తాం. పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. పిడుగురాళ్ల బైపాస్ రోడ్డు టిడిపి హయాంలోనే 80 శాతం పూర్తయ్యింది. అధికారంలోకి వచ్చిన వెంటనే బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తాం. టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్దిదారులకు అందజేస్తాం.
నారా లోకేష్ ను కలిసిన జూలకల్లు గ్రామస్తులు
గురజాల నియోకవర్గం జూలకల్లు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామానికి వ్యవసాయమే జీవనాధారం… కానీ దక్షిణ గడ్డ పొలానికి సాగునీటి సౌకర్యం లేదు. భూగర్భ జలాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నాం. మా గ్రామంగుండా సాగర్ కుడి కాల్వ వెళ్తున్నా..దక్షణగడ్డ పొలాలకు నీరు అందడం లేదు. కుడికాలువపై సన్నిగండ్ల వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి దక్షిణ గడ్డ పొలాలకు సాగునీరివ్వాలి. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినా ఎలాంటి ఉపయోగమూ లేదు. గ్రామంలో డ్రైనేజీ, రోడ్లు సరిగా లేవు. గ్రామంలోని జగనన్న కాలనీల స్థలాలు ఒకవర్గం వారికే ఇచ్చారు. TDP వచ్చాక అన్ని వర్గాల వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ
`కొత్తప్రాజెక్టుల మాట దేవుడెరుగు, ఉన్న ప్రాజెక్టుల గేట్లకు గ్రీజ్ కూడా పెట్టలేని దివాలాకోరు ప్రభుత్వమిది. ఐదేళ్ల టీడీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులపై రూ.68,294 కోట్లు ఖర్చు చేస్తే.. వైసిపి ప్రభుత్వం రూ.22 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అధికారంలోకి వచ్చాక సాగర్ కాల్వల ఆధునీకరణ చేపట్టి చివరి భూములకు నీరందేలా చర్యలు తీసుకుంటాం. పంచాయతీల నిధులను జగన్ ప్రభుత్వం దొంగిలించడంతో గ్రామాభివృద్ధికి కుంటుపడింది. సెంటుపట్టా పేరుతో రూ.7 వేల కోట్లు దోచుకొని అసలైన లబ్ధిదారులను గాలికొదిలేశారు. అధికారంలోకి వచ్చాక అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇస్తాం. మీకోసం పనిచేసే చంద్రన్నను సిఎం చేసేందుకు సహకారం అందించండి.
నారా లోకేష్ ను కలిసిన జానపాడు గ్రామస్తులు
గురజాల నియోజకవర్గం జానపాడు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. జానపాడు శివారులో 180 ఎకరాల్లోని చెరువు ఉంది. అందులో 30 ఎకరాల్లో గత ప్రభుత్వం మంచినీటి చెరువుగా మార్చి ఎన్ఎస్పీ కాల్వ ద్వారా నీటిని సరఫరా చేసింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక చెరువుకు నీటి సరఫరా నిలిపివేసింది. చెరువులో చేపలపెంపకం వల్ల నీటి సరఫరా నిలిచిపోయింది. వేసవికాలంలో అదే చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు అక్రమంగా జరుగుతున్నాయి. జానపాడు గ్రామంలో 70 శాతం మేర రోడ్లు గత ప్రభుత్వం వేసింది. ఈ ప్రభుత్వం వచ్చక మిగిలిన రోడ్లు వేయలేదు. గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు 3 కి.మీ దూరంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. ప్రభుత్వమే ఇల్లు నిర్మిస్తుందని చెప్పి ఇప్పటికీ ఒక్క ఇళ్లు కూడాపూర్తి కాలేదు. గ్రామంలో 90 శాతం మంది రైతులే ఉన్నారు. ఆర్బీకేల ద్వారా వ్యవసాయ పనిముట్లు, ఎరువులు అందడం లేదు. ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో దళారులకు విక్రయించాల్సి వస్తోంది. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ
DSAF కేంద్రం నిధులిచ్చినా ఉపయోగించుకోవడం చేతగాని ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్రప్రజల దౌర్భాగ్యం. ప్రజల దాహార్తిని తీర్చడం కంటే అక్రమ సంపాదనపైనే వైసిపి నేతలు దృష్టిసారిస్తున్నారు. తాగునీరు అందించాల్సిన చెరువును చేపలచెరువుగా మార్చి ప్రజలను ఇబ్బందిపెట్టడం దారుణం. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జానపాడుకు నీళ్లందించి తాగునీరు అందిస్తాం. అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేస్తున్న వైసిపి దొంగలపై ఉక్కుపాదం మోపుతాం. అడ్డగోలు దోపిడీ కోసం ఆవాసయోగ్యం కాని ప్రాంతాల్లో ఇళ్లస్థలాలు కేటాయించి పేదలను ఇబ్బందిపెడుతున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇస్తాం. రైతులు పండించిన ప్రతిగింజను ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం.
నారా లోకేష్ ను కలిసిన పిడుగురాళ్ల ముస్లింలు
పిడుగురాళ్ల ఘంటసాల విగ్రహం వద్ద ముస్లిం మైనారిటీలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయి..ఎస్సీల మాదిరి రక్షణ చట్టం కావాలి. ఈ ప్రభుత్వంలో మైనారిటీలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అందడం లేదు. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి రూ.10 లక్షల వరకూ రుణాలు అందించాలి. బీసీ, ఎస్సీలకు ఏర్పాటు చేసిన విధంగా సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి. దామాషా ప్రకారం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లు కేటాయించాలి. పది, ఇంటర్ తో చదువు నిలిపేసిన పేద ముస్లిం విద్యార్థులకు ఉపాధి కొరకు శిక్షణ అందించాలి. వక్ఫ్ బోర్డుల ఆస్తులకు రక్షణ కల్పించాలి. మదరసాలో ఆఫీస్, అలీమ్ కోర్సులు అయిన వారికి ఉర్దూ టీచర్లుగా ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలి. నిబంధనలు సడలించి దుల్హన్ పథకాన్ని పేద ముస్లింలందరికీ వర్తింపజేయాలి. గురజాల నియోజకవర్గంలో జరిగిన దాడులపై న్యాయ విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ
వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో తాలిబాన్ తరహా పాలన సాగుతోంది. గతంలో ఎన్నడూలేని విధంగా ముస్లిం మైనారిటీలపై తీవ్రమైన అణచివేత చర్యలకు పాల్పడుతున్నారు. గురజాల నియోజకవర్గం పెదగార్లపాడుకు చెందిన 6 ఏళ్ల ముస్లిం బాలికపై అత్యాచారం చేసిన వైసీపీ కామాంధుడికి ఇంతవరకు శిక్షపడలేదు…బాధిత కుటుంబానికి ఇప్పటికీ న్యాయం జరగలేదు. వక్ఫ్ బోర్డు ఆస్తుల రక్షణకోసం పోరాడిన ఇబ్రహీంను నరసరావుపేటలో దారుణంగా హత్య చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ముస్లింల ఆస్తులకు పటిష్టమైన రక్షణ కల్పిస్తాం. పేదముస్లింలకు ఇస్లామిక్ బ్యాంకు ద్వారా ఆర్థిక సాయం అందిస్తాం. ఎటువంటి షరతులు లేకుండా దుల్హాన్ పథకాన్ని పేద ముస్లింలందరికీ వర్తింపజేస్తాం.
నారా లోకేష్ ను కలిసిన పిడుగురాళ్ల ఎస్సీలు
పిడుగురాళ్ల రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఎస్సీలు నారా లోకేస్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గత ప్రభుత్వంలో ఎస్సీల్లోని మహిళలకు డ్వాక్రా రుణాల ద్వారా రుణాలు అందించారు. దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా అందించారు. నాలుగేళ్లుగా ప్రభుత్వం మహిళాభివృద్ధికి ఆర్థిక సాయం అందించడం లేదు. చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నా చర్యలు తీసుకోవడం లేదు. విదేశీ విద్యను కూడా ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. రాష్ట్రంలో యువతకు గంజాయి అలవాటు చేసి జీవితాలను సర్వనాశనం చేశారు. ఉద్యోగాలు లేక ఉన్నత చదువులు చదివిన వారు మద్యం షాపుల్లో పనిచేస్తున్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించారు. ఎస్సీ కార్పొరేషన్ ను నిర్వీర్యంచేసి పేద దళిత యువకులకు తీరని ద్రోహం చేశారు.
నారా లోకేష్ మాట్లాడుతూ
ఎస్సీలకు ఖర్చు చేయాల్సిన రూ.28,147 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన వైసీపీ ఎస్సీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో బెస్ట్ అవెయిలబుల్ స్కూల్ విధానాన్ని తీసుకొచ్చాం. ఎస్సీల సంక్షేమానికి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 27సంక్షేమపథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దుచేసింది. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైసిపి ప్రభుత్వం రద్దుచేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తాం. ఎస్సీ కార్పొరేషన్ ను బలోపేతం చేసి దళిత యువకులకు స్వయం ఉపాధి రుణాలు అందజేస్తాం. అంబేద్కర్ విదేశీవిద్య పథకాన్ని పునరుద్దరించి పేద విద్యార్థులకు సాయం అందిస్తాం.
Also Read this Blog:Connecting Communities: Naralokesh’s Padayatra Expedition
Tagged:#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh